HD Kumaraswamy : కేఫ్ కాఫీ డే వ్యవస్ధాపకులు వీజీ సిద్ధార్ధ ఆత్మహత్యకు సంబంధించి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు అన్ని విషయాలూ తెలుసని కేంద్ర మంత్రి, కర్నాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి అన్నారు. సిద్ధార్ధ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారో డీకే శివకుమార్ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
డీకే శివకుమార్‌కు దివంగత పారిశ్రామికవేత్తకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసునని అన్నారు. సిద్ధార్ధ ఆత్మహత్యకు దారితీసిన విషయాలన్నింటినీ బయటపెట్టాలని తాను ఆయనను కోరుతున్నానని చెప్పారు. కాగా కేంద్ర మంత్రి కుమారస్వామి ఆదివారం మాండ్యలో రైతులతో కలిసి నాట్లు వేశారు. రైతులతో కలిసి సాగు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు.
ఇది తన కుటుంబ సభ్యుల కార్యక్రమమని అన్నారు. వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం తనకు సంతృప్తి ఇస్తుందని అన్నారు. రైతులతో కలిసి ఇవాళ కొన్ని మొక్కలు నాటామని చెప్పారు. హెచ్డీ దేవెగౌడ రైతు కుటుంబం నుంచి వచ్చారని, వ్యవసాయం తమ రక్తంలోనే ఉందని తెలిపారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు బాగా పడ్డాయని, దీంతో రైతులంతా సంతోషంగా పొలాల్లో పనిచేసుకుంటున్నారని అన్నారు.
Read More :
KTR | ఆమె నుంచి చాలా నేర్చుకున్నా..: కేటీఆర్