Raja Saab | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి రాజాసాబ్ (Raja Saab). హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ చిత్రాన్ని మారుతి (Maruthi) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో మలయాళ భామ మాళవికా మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇటీవలే జాసాబ్ గ్లింప్స్ షేర్ చేయగా.. ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతున్న విజువల్స్ నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
రాజాసాబ్ కో ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. రాజాసాబ్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ ఫార్మాలిటీస్ పూర్తి కాబోతున్నాయని చెప్పారు. మరోవైపు ప్రభాస్‌తో ఉన్న స్టిల్‌ను షేర్ చేస్తూ.. జాన్ త్వరలోనే వస్తున్నాడు.. రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ జనవరిలో రాబోతుంది.. అంటూ హింట్ కూడా ఇచ్చాడు. ఈ వార్తలతో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు.
మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన రాజాసాబ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాజాసాబ్‌లో మున్నాభాయ్ ప్రభాస్ తాతగా కనిపించబోతున్నాడని తెలుస్తోండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీలో రిద్ది కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజాసాబ్ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
రాజాసాబ్ గ్లింప్స్..
They Call Him OG | పవన్ కల్యాణ్ బ్యాక్ టు సెట్స్.. ఓజీ షూట్ డేట్ ఫిక్సయినట్టే..?
Matka | వరుణ్ తేజ్ మట్కా కింగ్ వాసు లుక్ అదిరింది.. !