Asia Cup Final : పాక్ నిర్దేశించిన మోస్తరు లక్ష్య ఛేదనలో భారత్ మరో వికెట్ కోల్పోయింది. నాలుగో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సంజూ శాంసన్(24) ఔటయ్యాడు. అబ్రార్ ఓవర్లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా సంజూ ఆడిన బంతిని ఫఖర్ చక్కగా అందుకున్నాడు. దాంతో.. 57 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది.
భారత యువకెరటం తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. టాపార్డర్ విఫలం కావడంతో 20కే మూడు వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వలేదీ యంగ్‌స్టర్. ఆచితూచి ఆడుతూ జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్న అతడు శాంసన్‌తో కలిసి 44 బంతుల్లో 50 రన్స్ జోడించాడు. అబ్రార్ ఓవర్లో తిలక్, ఆయూబ్ ఓవర్లో చెరొక సిక్సర్ బాదిన ఈ ఇద్దరూ జ్టు స్కోర్ 70 దాటించారు. రన్‌రేటు పెరుగుతున్నందున పెద్ద షాట్‌కు యత్నించిన సంజూ వెనుదిరిగాడు. ఇంకా విజయానికి 46 బంతుల్లో 70 రన్స్ కావాలి.
From 20-3 to 50-3 🤝
Asia Cup LIVE ➡️ https://t.co/6yhNKeDWc4 pic.twitter.com/j3pzC1979Z
— ESPNcricinfo (@ESPNcricinfo) September 28, 2025