శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 15, 2020 , 17:28:44

హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంను కలిసిన సైనా నెహ్వాల్‌, కశ్యప్‌

హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంను కలిసిన సైనా నెహ్వాల్‌, కశ్యప్‌

షిమ్లా : భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌, ఆమె భర్త పారుపల్లి కశ్యప్‌ ఆదివారం హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా వారికి సీఎం ఆత్మీయ స్వాగతం పలికారు. షిమ్లాలోని అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారన్నారు. ‘ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని మీరు ఇష్టపడుతారు. మీ సందర్శన చిరస్మరణీయమైంది’ అని ఠాకూర్‌ ట్వీట్‌ చేశారు. గత వారం, కశ్యప్, సైనా నెహ్వాల్‌ మాల్దీవుల్లో హాలిడేస్‌ను గడిపారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.