లాహోర్: టీ20 ప్రపంచకప్‌నకు సన్నాహకంగా పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియాకు తొలి మ్యాచ్‌లో షాక్ తగిలింది. స్వల్ప స్కోర్లు నమోదైన పోరులో పాక్.. ఆసీస్‌పై 22 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. స్పిన్‌కు సహకరించిన పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 20 ఓవర్లకు 168/8 రన్స్ చేసింది.
సయీమ్ అయూబ్ (22 బంతుల్లో 40, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సల్మాన్ అఘా (39) రాణించారు. ఆడమ్ జంపా (4/24) నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో కంగారూలు నిర్ణీత ఓవర్లలో 146/8 వద్దే ఆగిపోయారు. గ్రీన్ (36) టాప్ స్కోరర్. పాక్ స్పిన్నర్లు కట్టడి చేయడమే గాక క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కంగారూలపై ఒత్తిడి పెంచారు. బ్యాట్‌తో రాణించిన అయూబ్.. బంతితో (2/29)నూ మెరిసి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా టీ20ల్లో ఏడేండ్ల తర్వాత పాక్.. ఆసీస్‌ను ఓడించడం గమనార్హం.