Sachin Tendulkar : ప్రస్తుతం ప్రతి రంగంలోనూ కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతోంది. విద్య, వైద్యంలోనే కాదు పలు విభాగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) అద్భుతాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న ఈ సాంకేతికతను క్రికెట్లో ఎందుకు వాడకూడదు అనుకున్నాడు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్. అనుకున్నదే తడవుగా 2011 వరల్డ్ కప్ సంబురాలకు సంబంధించిన ఏఐ ఆధారిత ఫొటో ఒకటి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
జపాన్‌కు చెందిన యానిమేషన్ స్టూడియో ఘిబ్లీ(Ghibli) స్ఫూర్తితో డిజైన్ చేసిన ఆ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఈ వైరల్ పిక్ గురించి సచిన్ ఏం చెప్పాడంటే..? ‘ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించే మాట్లడుకుంటున్నారు. ఏఐ ట్రెండింగ్ అవుతోంది. కృత్రిమ మేధస్సు గురించి నేను విన్నాను. ఘిబ్లీ స్డూడియో గనుక క్రికెట్ ఫొటోలను రూపొందిస్తే ఎలా ఉంటుంది? అనే ఉద్దేశంతో ఈ ఫొటోను మీతో పంచుకుంటున్నా’ అని సచిన్ క్యాప్షన్ పెట్టాడు.
AI-sa kuch trend ho raha hai, maine suna. Toh socha, what if Ghibli made cricket? pic.twitter.com/NdKptwOliM
— Sachin Tendulkar (@sachin_rt) March 27, 2025
పదహారేళ్ల వయసులోనే అరంగేట్రం చేసిన సచిన్.. క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అయితే.. వరల్డ్ కప్ కలను సాకారం చేసుకునేందుకు 2011 వరకు నిరీక్షించాడీ లెజెండ్. ముంబైలోని వాంఖడే మైదానంలో శ్రీలంకను ఓడించి ధోనీ సారథ్యంలోని టీమిండియా ట్రోఫీ గెలుపొందింది. ఆ రోజు జట్టు సహచరులు ఈ లెజెండరీ ఆటగాడిని భుజాన మోస్తూ మైదానం అంతా తిరిగారు. అందుకే.. ఆ ట్రోఫీ సచిన్‌కు ఎంతో ప్రత్యేకం.
తన కెరియర్లో చిరస్మరణీయమైన 2011 వన్డే వరల్డ్ విజయాన్ని సచిన్ ఏఐ ఫొటోగా మలిచాడు. రెండు ఫొటోలను క్లబ్ చేసిన మాస్టర్ బ్లాస్టర్ ఒకదాంట్లో సహచరుల భుజాలపై కూర్చొని చేతిలో మువ్వన్నెల జెండాతో మురిసిపోతున్నాడు. మరోదాంట్లో వరల్డ్ కప్ ట్రోఫీతో చిరునవ్వులు చిందిస్తున్నాడు సచిన్. ఇంకేముంది. ఈ ఫొటో అభిమానులకు తెగ నచ్చేసింది. ‘లవ్ యూ సచిన్’. ‘యూ ఆర్ లెజెండ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 2013లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సచిన్ ప్రస్తుతం లెజెండ్స్ లీగ్‌లో ఆడుతున్నాడు.