మాగనూరు, మార్చి 27 : మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత రెండు నెలల క్రితం జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలాడుతూ తను చెప్పినవన్నీ నిజాలు అని నమ్మించే విధంగా ప్రసంగం చేస్తే మక్తల్ నియోజకవర్గంలో నమ్మేటట్టు ఎవరూ లేరని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
గురువారం మాగనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మీ పరిపాలనను 15 నెలల నుండి మక్తల్ నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిన రెండవ రోజు కూడా విద్యార్థులకు వండిన అన్నంలో, పురుగులు రావడం వల్ల, విద్యార్థులకు పురుగుల అన్నం పెడితే మళ్లీ విద్యార్థులు అనారోగ్య బారిన పడాల్సిన పరిస్థితి వస్తుందని నేపథ్యంతో, పురుగుల ఆహారం చల్లించి, సొంత డబ్బులతో బియ్యం తెప్పించి విద్యార్థులకు ఆహారం పెట్టిస్తే ఓర్చుకోలేని ఎమ్మెల్యే, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతూ సభలో ఉన్న సభ్యులను పక్కదారి పట్టిస్తున్నారని ఎద్దెవా చేశారు.
పాఠశాలలో విద్యార్థులకు సరిపడే అన్నం ఉన్నందువల్ల, అక్కడ ఉన్న అధికారులు విద్యార్థులకి సరిపోదు కాబట్టి, అలాంటి సమయంలో, పాఠశాలలో మా వెనుక వచ్చిన కార్యకర్తలు అన్నం తింటే విద్యార్థులకు సరిపోతుందా తోడమైన తెలివితో ఆలోచన చేసి, అసెంబ్లీలో మాట్లాడాలి అని మాజీ ఎమ్మెల్యే సూచించారు. అసెంబ్లీలో నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలోనే మక్తల్ కోర్టు, నూతన ఆసుపత్రి భవనం, ఫైర్ స్టేషన్, సంగం బండ లెఫ్ట్ లో లెవెల్ కెనాల్ కాల్వ బండ పగలగొట్టడానికి కూడా గత ప్రభుత్వంలోనే డబ్బులు మంజూరయ్యాయి. ఇక మీరు చేసింది ఏంటో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.. ప్రస్తుత ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన పనులకు ఆడంబారాలతో మళ్లీ భూమి పూజలు చేశారు తప్ప.. కాంగ్రెస్ ప్రభుత్వం లో మీరు చేసింది ఏమిటో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలన్నారు.
సంగంబండ రిజర్వాయర్లో సాగునీరు ఉన్న రైతులకు సక్రమంగా సాగునీరు అందించలేక పోతున్నారని రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. మక్తల్ నియోజకవర్గంలో సాగునీరు పంటలకు అందకపోవడంతో చేతికి వచ్చిన పంటలను రైతన్నలు ఎండ పెట్టుకుంటే, రైతులతో దగ్గరకి వెళ్లి మాట్లాడిన దాఖలాలు లేవు కానీ, అసెంబ్లీలో మాత్రం పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కష్టాలు తెలుసుకున్నది కేవలం భారత రాష్ట్ర సమితినేనని, పది సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రోజు రైతులకు సాగునీరు కష్టాలు రానీయకుండా చూసింది చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. ఈ సమావేశంలో మగనూర్ పీఏసీఎస్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు మధుసూదన్ రెడ్డి, పూల రాములు, పల్లె మారెప్ప, బసంత్ రెడ్డి, సుల్తాన్, డీజిల్ సబెన్న, అలి తదితరులు ఉన్నారు.