SA20 Auction : ప్రపంచ క్రికెట్లో టీ20ల క్రేజ్ తగ్గట్లేదు. ఏడాది పొడవునా పొట్టి లీగ్స్ జరుగుతూనే ఉన్నాయి. త్వరలోనే మరో టీ20 లీగ్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అవును.. దక్షిణాఫ్రికా 20 లీగ్ (SA20) మూడో సీజన్ వచ్చే ఏడాది జనవరి 9న మొదలవ్వనుంది. అంతకంటే ముందుగా మినీ వేలానికి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీన ఎస్ఏ20 మూడో సీజన్ మినీ వేలం జరుగనుంది. ఈ విషయాన్ని శుక్రవారం బెట్‌వే ఎస్ఏ20 చైర్మన్ గ్రేమ్ స్మిత్ (Graeme Smith) ఓ ప్రకటనలో వెల్లడించాడు.
ఐపీఎల్ స్ఫూర్తితో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సైతం ఎస్20 లీగ్‌కు 2023లో శ్రీకారం చుట్టింది. తొలి రెండు సీజన్లు రంజుగా సాగడంతో మూడో సీజన్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని నిర్వాహకులు భావిస్తున్నారు. మూడో సీజన్లో ప్రతి జట్టుకు 13 మంది ఆటగాళ్లను కొనడానికి వీలుంటుంది.
#BetwaySA20 Player Auction Registration is 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋𝐋𝐘 𝐎𝐏𝐄𝐍❗
Submit your interest here 🔗 https://t.co/Ix6ulUAsQ2 pic.twitter.com/P0011eEF5d
— Betway SA20 (@SA20_League) August 16, 2024
‘ఎస్ఏ20 మూడో సీజన్లో పలువురు అంతర్జాతీయ స్టార్లు పాల్గొంటారు. దినేశ్ కార్తిక్, జో రూట్, కేన్ విలిమయ్సన్, రహ్మనుల్లా గుర్బాజ్, జానీ బెయిర్‌స్టో, డెవాన్ కాన్వే.. ఫేమస్ క్రికెటర్లంతా తమ జట్ల తరఫున దంచేందుకు రెడీగా ఉన్నారు. ఈ వేలంలో పాల్గొనాలనుకునే వాళ్లు ఆగస్టు 16 నుంచి తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 6వ తేదీతో రిజిస్ట్రేషన్ గడువు ముగుస్తుంది. ఎస్ఏ 20కి వరల్డ్ క్లాస్ గుర్తింపు రావడానికి కష్టపడ్డ ప్రతిఒక్కరికి ధన్యవాదాలు’ అని స్మిత్ తెలిపాడు.
𝐂𝐀𝐍 𝐘𝐎𝐔 𝐅𝐄𝐄𝐋 𝐈𝐓⁉️ #BetwaySA20 League Commissioner Graeme Smith 𝒘𝒆𝒍𝒄𝒐𝒎𝒆𝒔 𝒘𝒐𝒓𝒍𝒅-𝒄𝒍𝒂𝒔𝒔 𝒕𝒂𝒍𝒆𝒏𝒕 𝒂𝒉𝒆𝒂𝒅 𝒐𝒇 𝑺𝒆𝒂𝒔𝒐𝒏 3 🏏
𝑃𝑙𝑎𝑦𝑒𝑟 𝐴𝑢𝑐𝑡𝑖𝑜𝑛 𝑠𝑒𝑡 for 1 October 📅
Check out all the details here 🔗 https://t.co/A6XJNAQG77 pic.twitter.com/wTHbc4UvKx
— Betway SA20 (@SA20_League) August 16, 2024
ఎస్ఏ20 మూడో సీజన్ 2025 జనవరి 9న మొదలవ్వనుంది. నెల రోజుల పాటు జరిగే ఈ టోర్నీల్ ఎడెన్ మర్క్రమ్ సారథ్యంలోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (Sunrisers Eastern Cape) డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు చెందిన పార్ల్ రాయల్స్ (Paarl Royasl)జట్టు జెర్సీతో కార్తిక్ తళుక్కుమననున్నాడు. దాంతో, ఎస్ఏ 20లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా కార్తిక్ రికార్డు సొంతం చేసుకున్నాడు.