Ruturaj Gaikwad : భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా(Australia)పై టీ20ల సిరీస్(T20 Series)లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రుతురాజ్ రికార్డు సృష్టించాడు. ఐదు మ్యాచుల్లో ఈ యువ కెరటం ఒక సెంచరీతో కలిపి 55.75 సగటుతో 223 రన్స్ బాదాడు. దాంతో, కంగారూలపై రెండేండ్ల క్రితం న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్ మార్టిన్ గఫ్టిల్(Martin Guptill) నెలకొల్పిన రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
ఆసీస్‌తో 2021లో జరిగిన టీ20 సిరీస్‌లో గఫ్టిల్ 218 పరుగులు చేశాడు. అంతేకాదు మొత్తంగా ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా గైక్వాడ్ గుర్తింపు సాధించాడు. ఆసీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో రుతురాజ్ మరో ఫీట్ సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో వేగంగా 4 వేల పరుగుల క్లబ్లో చేరాడు. తద్వారా టీమిండియాకే చెందిన కేఎల్ రాహుల్ (117 ఇన్నింగ్స్‌లు) రికార్డును గైక్వాడ్ బద్ధలు కొట్టాడు.
రుతురాజ్ గైక్వాడ్

దాంతో, పొట్టి ఫార్మాట్లో వేగంగా 4 వేల రన్స్ కొట్టిన ఐదో క్రికెటర్‌గా గైక్వాడ్ సృష్టించాడు. 116 ఇన్నింగ్స్‌ల్లోనే అతడు 4 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. పొట్టి క్రికెట్లో ఫాస్ట్‌గా 4వేల రన్స్ కొట్టిన వాళ్ల జాబితాలో విండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్(107 ఇన్నింగ్స్‌లు) ముందున్నాడు. అతడి తర్వాత షాన్ మార్ష్(113 ఇన్నింగ్స్‌లు), బాబర్ ఆజాం(115 ఇన్నింగ్స్‌లు), డెవాన్ కాన్వే(116 ఇన్నింగ్స్‌లు) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.