Free Kick Goal : ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రీమియర్ లీగ్‌లో లివర్‌పూల్(Liverpool) జట్టు ఫుట్‌బాలర్ స్టన్నింగ్ గోల్‌తో మెరిశాడు. ఫుల్హాం జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 25 ఏండ్ల ట్రెంట్ అలెగ్జాండర్ అర్నాల్డ్ ఫ్రీ కిక్(Free Kick)ను అద్భుత గోల్‌గా మలిచాడు. అర్నాల్డ్ 20వ నిమిషంలో కొట్టిన బంతి బార్ క్రాస్ కొంచెం దిగువగా గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. దాంతో, పుల్హాం గోల్‌కీపర్ బెర్న్డ్ లెనో చేష్టలుడిగి చూస్తుండిపోయాడు.
A trademark for https://t.co/DOQTDKTyK1😎 pic.twitter.com/tIOq5R1Ypf
— Sifaaro-joe (@BalogunLamba) December 3, 2023
అర్నాల్డ్ ఫ్రీ కిక్ గోల్
అర్నాల్డ్ గోల్‌తో లివర్‌పూల్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే.. కాసేపటికే పుల్హాం ప్లేయర్ హ్యారీ విల్సన్ సూపర్ గోల్‌తో స్కోర్ సమం చేశాడు. 39వ నిమిషంలో అలెక్సిస్ మ్యాక్ అలిస్టర్ దూరం నుంచి బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి లివర్‌పూల్ ఆధిక్యాన్ని 2-1కు పెంచాడు. కానీ, పుల్హాం ఆటగాడు కెన్నీ టెటే గోల్ కొట్టడంతో 2-2తో మ్యాచ్ డ్రాగా ముగిసింది.