న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌లో ప్లకార్డులు ప్రదర్శన కుదరదని లోక్‌సభ స్పీకర్(Loksabha speaker) ఓం బిర్లా అన్నారు. ఇవాళ లోక్‌సభ ప్రారంభమైన తర్వాత.. విపక్షాలు వాయిదా తీర్మానాల గురించి ప్రశ్నించాయి. ఆ సమయంలో కొందరు విపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో ప్లకార్డులను ప్రదర్శించడాన్ని ప్రభుత్వ తప్పుపట్టింది. బీఎస్పీ ఎంపీ దనిష్ అలీ ప్లేకార్డుతో సభలోకి రావడాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తప్పుపట్టారు. వాటిని సభలో నిషేధించినట్లు ఆయన చెప్పారు.
ప్లేకార్డులతో సభకు రావడం నియమాలకు విరుద్ధమని స్పీకర్ బిర్లా అన్నారు. ప్లకార్డులతో వచ్చిన ఎంపీలు సభను వీడాలని ఆయన కోరారు. కొత్త బిల్డింగ్‌లో సభా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, కొత్త బిల్డింగ్‌లో సభ్యులు ఎవరూ ప్లకార్డులతో రావద్దు అని స్పీకర్ తెలిపారు. అయితే విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టడంతో.. సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.
సభకు అవమానం జరిగిందన్న ప్లేకార్డును మెడలో వేసుకున్న ఎంపీ దనిష్ అలీ.. లోక్‌సభలోకి ఎంటర్ అయ్యారు. అయితే ఎంపీ మహువా మొయిత్రాపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టు .. రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు చెప్పారు. హౌజ్‌లో దీనిపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఓ సభ్యురాలిపై సుమోటో నోటీసులు ఎలా ఇస్తారని స్పీకర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు.
#WATCH | BSP MP Danish Ali says, “Ethics Committee report is against the rules, Mahua Moitra’s deposition is incomplete. So, we are demanding a discussion at least in the House. We have also written to the Speaker about how can there be a suo-motu recommendation against a Member.… pic.twitter.com/QpGrQKJrYd
— ANI (@ANI) December 4, 2023