న్యూఢిల్లీ: 2020 నాటి ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో విద్యార్థి కార్యకర్తలు ఉమర్ ఖాలిద్, షార్జిల్ ఇమామ్‌కు సుప్రీం కోర్టు సోమవారం బెయిల్ నిరాకరించింది. వారిద్దరూ నేర పూరిత కుట్రకు పాల్పడినట్టు తగిన ఆధారాలు ఉండటం వల్లే వారి విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నామని కోర్టు పేర్కొంది. అయితే మరో అయిదు మంది నిందితులకు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.
కోర్టు నిర్ణయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు స్వాగతించారు. నాటి అల్లర్లు ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసినవని ఢిల్లీ పోలీసులు కోర్టు ముందు వాదించారు. ‘భారత్ ముక్కలుగా విభజించబడుతుంది’ అన్న నివాదాలను ఖాలిద్ చేసినట్టు పోలీసులు ఆధారాలు చూపారు. నాటి అల్లర్లలో 53 మంచి చనిపోగా, 700 మందికి పైగా గాయపడ్డారు.