IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగిస్తోంది. మూడో రోజు భారత బౌలర్లను ఉతికేస్తూ జో రూట్(150), బెన్ స్టోక్స్ (77 నాటౌట్), ఓలీ పోప్(71)లు విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించారు. టీ సెషన్ తర్వాత రూట్‌ను స్టంపౌట్ చేసిన జడేజా వికెట్ల వేటకు తెరతీయగా.. బుమ్రా, సిరాజ్‌లు తలా ఒక వికెట్ తీశారు. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన స్టోక్స్ బ్యాటింగ్ కొనసాగించాడు. మూడో రోజు ఆట ముగిసేస సరికి డాసన్(21 నాటౌట్)తో పాటు అతడూ అజేయంగా నిలిచారు. దాంతో, ఆతిథ్య జట్టు 7 వికెట్ల న|ష్టానికి 544 రన్స్ చేసి.. 186 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మూడో రోజు భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. తొలి సెషన్లో ఒక్క వికెట్ కూడా తీయలేక ఇంగ్లండ్‌కు మ్యాచ్‌పై పట్టుబిగించే అవకాశం కల్పించారు. ప్రధాన పేసర్ బుమ్రా, సిరాజ్‌లు తేలిపోగా.. ఓలీ పోప్(71) జతగా జో రూట్(150) రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. లంచ్ తర్వాత వాషింగ్టన్ సుందర్ వరుస ఓవర్లలో పోప్, హ్యారీ బ్రూక్(3)ను ఔట్ చేసి బ్రేకిచ్చాడు. కానీ, బెన్ స్టోక్స్ అండగా రూట్ మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కెరీర్లో 38వ, భారత్‌పై 12వ శతకంతో చెలరేగిన రూట్‌ను డేజా పెవిలియన్ పంపాడు.
Record-breaking Root puts England in a commanding position at the end of Day 3 at Old Trafford!
Scorecard: https://t.co/bFpNZVnhEJ pic.twitter.com/vqnCs5mIUO
— ESPNcricinfo (@ESPNcricinfo) July 25, 2025
ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్ జేమీ స్మిత్‌ను బుమ్రా ఔట్ చేసి ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు. కొద్దిసేపటికే క్రిస్ వోక్స్‌ను సిరాజ్ ఔట్ చేసి వందో మ్యాచ్‌లో తొలి వికెట్ సాధించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టోక్స్ , లియాం డాసన్(21 నాటౌట్)తో కలిసి 16 రన్స్ జోడించాడు. వీరిద్దరు ఆచితూచి ఆడగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 7 వికెట్ల న|ష్టానికి 544 రన్స్ చేసింది. ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో నిలిచిన ఇంగ్లండ్ నాలుగో రోజు మరిన్ని రన్స్ రాబట్టి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టాలని భావిస్తోంది.