దుబాయ్: ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 76 పరుగులతో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో మూడో ర్యాంక్‌కు ఎగబాకాడు. గత వారం ఐదో స్థానంలో ఉన్న రోహిత్.. న్యూజిలాండ్‌తో పోరులో రాణించడంతో రెండు స్థానాలు మెరుగుపరుచుకోవడమే గాక ఐదో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీనీ అధిగమించాడు. బ్యాటర్ల జాబితాలో శుభ్‌మన్ గిల్.. 784 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టాప్-10లో భారత్ నుంచి గిల్, రోహిత్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (8) నలుగురు చోటు దక్కించుకున్నారు. ఫిబ్రవరి నెలకు గాను గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు దక్కింది.