Rohit Sharma : సుదీర్ఘ ఫార్మాట్లో 30వ సెంచరీ కోసం విరాట్ కోహ్లీ(Virat Kohli) నిరీక్షించక తప్పడం లేదు. చెపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులకే ఔటైనా విరాట్ రెండో ఇన్నింగ్స్‌లో కుదురుకున్నట్టే కనిపించాడు. 37 బంతులు ఎదుర్కొని బంగ్లాకు సవాల్ విసిరిన అతడు అనుకోకుండా 17 పరుగుల వద్ద అంపైర్ తప్పిదానికి ఎల్బీగా ఔటయ్యాడు. ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవం గల విరాట్ డీఆర్ఎస్ తీసుకోకపోవడం కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు జట్టు సభ్యులను ఆశ్చర్యానికి గురి చేసింది.
మెహిదీ హసన్ మిరాజ్ ఓవర్లో బౌండరీ కొట్టిన కోహ్లీ.. ఆ తర్వాతి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. మిరాజ్ సహా బంగ్లా ఆటగాళ్లంతా అప్పీల్ చేయడంతో అంపైర్ రాడ్ టక్కర్ వేలు పైకెత్తేశాడు. అయితే.. అది నాటౌట్ అనే సందేహంతో నాన్ స్ట్రయికర్ శుభ్‌మన్ గిల్ (Shumban Gill)ను ‘రివ్యూ తీసుకోవాలా? నువ్వు చూశావా?’ అని కోహ్లీ అడిగాడు. అందుకు గిల్.. ఎల్బీనే అని చెప్పడంతో అనుమానంగానే క్రీజును వీడాడు.
Rohit Sharma and Kettleborough’s reaction to Virat Kohli not reviewing even after the edge. 🥲💔 pic.twitter.com/O9tK060MyD
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2024
అయితే.. రీప్లేలో బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుంది. అది ‘నాటౌట్’ అని తేలింది. దాంతో, డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న కెప్టెన్ రోహిత్ ‘అరే యార్.. బ్యాటుకు తాకింది కదా! రివ్యూ తీసుకుంటే బాగుండు’ అన్నట్టుగా రియాక్షన్ పెట్టాడు. మరోవైపు టీవీ రిప్లే చూసిన అంపైర్ కెటిల్‌బరో సైతం కోహ్లీ డీఆర్ఎస్కు వెళ్లకపోవడంతో తనలో తానే నవ్వుకున్నాడు.
A brain-fade moment for Virat Kohli. He didn’t use DRS 👀 pic.twitter.com/X6fMTPQhnZ
— CricTracker (@Cricketracker) September 20, 2024
టీ20 వరల్డ్ కప్ విజేతగా స్వదేశంలో తొలి టెస్టు ఆడుతున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం జస్ప్రీత్ బుమ్రా(4/50) విజృంభణతో బంగ్లాదేశ్‌ను 149కే కట్టడి చేసింది. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ వైఫల్యం కారణంగా భారత్ మూడు వికెట్ల నష్టానికి 81 రన్స్ కొట్టింది. రెండో రోజు ఆటముగిసే సరికి శుభ్‌మన్ గిల్(33 నాటౌట్), రిషభ్ పంత్ (12 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి రోహిత్ సేన 308 పరుగుల ఆధిక్యంలో ఉంది.