Israel | ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లెబనాన్ మద్దతుగల హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్‌పై మూడు వరుస దాడులకు పాల్పడింది. ఈ మూడు దాడుల్లో హిజ్బుల్లా ఉగ్రవాదాలు దాదాపు 140 మిస్సైల్‌ని ప్రయోగించారు. అయితే, దాడుల్లో ఎంత వరకు నష్టం జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. అయితే, పేజర్లు, వైర్లెస్ వాకిటాకి తదితర వస్తువుల కారణంగా పేలుళ్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో జనం ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది జనం తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇజ్రాయెల్ ప్రమేయం ఉందని ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడులకు పాల్పడినట్లు తెలుస్తున్నది. హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లాల్సిన వందలాది రాకెట్ లాంచర్ బారెల్స్ని ఫైటర్జెట్లు బాంబులు వేసి ధ్వంసం చేసినట్లు సైన్యం పేర్కొంది. మధ్యామ్నం నుంచి అర్ధరాత్రి వరకు సుమారు వెయ్యి బారెల్స్‌తో సుమారు వంద రాకెట్ లాంచర్స్పై ఫైటర్ జెట్లు దాడి చేశాయని ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్‌ను కాపాడుకునేందుకు హిజ్బుల్లా గ్రూప్‌తో పాటు మౌలిక సదుపాయాలను నాశనం చేసేందుకు దాడులు కొనసాగిస్తామని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.