Rohit Sharma | లక్నో : ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ రోహిత్‌శర్మకు గాయమైంది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న సమయంలో నెట్స్‌లో రోహిత్ గాయపడ్డాడు. బంతి మెకాలికి బలంగా తాకడంతో శుక్రవారం లక్నోతో మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో లేడని కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ సమయంలో పేర్కొన్నాడు. ఈ సీజన్లో మూడు మ్యాచ్‌లాడిన హిట్‌మ్యాన్ 0, 8, 13 పరుగులతో నిరాశపరిచాడు.
మరోవైపు వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న స్టార్ స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలో జట్టులో చేరే అవకాశముందని పాండ్యా తెలిపాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడ్డ బుమ్రా.. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. ఇదిలా ఉంటే లక్నోతో మ్యాచ్ ద్వారా ముంబైకి 100వ మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్‌యాదవ్.. టీమ్ మేనేజ్మెంట్ నుంచి ప్రత్యేక జెర్సీ అందుకున్నాడు.