Rohit Sharma: ముంబై ఇండియన్స్ సారథిగా హార్ధిక్ పాండ్యాను ఎంపికచేయడంతో రోహిత్ శర్మ అభిమానులంతా ఆ జట్టు హిట్‌మ్యాన్‌కు వెన్నుపోటు పొడిచిందని, ఇది కుట్ర అని దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ పాండ్యాకు ముంబై సారథ్య పగ్గాలు ఇవ్వడంపై రోహిత్‌కు ముందే తెలుసా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇందులో కుట్ర ఏమీ లేదని, హార్ధిక్ సారథ్యంలో ఆడేందుకు రోహిత్ అంగీకరించాడని, అలా సమ్మతించిన తర్వాతే ముంబై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అక్టోబర్ – నవంబర్‌లో స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరుగుతుండగానే రోహిత్‌కు ఈ విషయం గురించి ముంబై యాజమన్యం సమాచారం అందించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ యాజమన్యంతో విభేదాల కారణంగా పాండ్యా ఆ జట్టు మారాడని వార్తలు వచ్చినా ముందుగా ముంబై ఇండియన్సే హార్ధిక్ పాండ్యాను ట్రేడ్ ప్రక్రియలోకి రావాలని ఆహ్వానించినట్టు సమాచారం. ముంబై ఈ ప్రతిపాదన తీసుకురాగానే పాండ్యా.. తనకు జట్టు సారథ్య పగ్గాలు అప్పజెప్పితేనే అందుకు ఒప్పుకుంటానని కండీషన్ పెట్టాడని అందుకు ముంబై కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.
Timeline of Hardik Pandya’s return: (Indian Express).
– MI approached Hardik Pandya for trade.
– Hardik put the condition to be made the captain.
– MI accepted Hardik’s condition and informed Rohit.
– Rohit agreed to play under Hardik.— Mufaddal Vohra (@mufaddal_vohra) December 16, 2023
హార్ధిక్ కండీషన్ గురించి ముంబై యాజమన్యం రోహిత్‌కు తెలపడంతో హిట్‌మ్యాన్ కూడా అందుకు అంగీకరించాడని, హార్ధిక్ సారథ్యంలో ఒప్పుకున్న తర్వాతే ముంబై తదుపరి ప్రక్రియను ప్రారంభించినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనంలో పేర్కొంది. 2013 సీజన్ మధ్యలో ముంబై పగ్గాలు చేపట్టి అదే సీజన్లో ఆ జట్టుకు తొలి టైటిల్ అందించిన రోహిత్.. పదేండ్లపాటు నడపించాడు. అతడి సారథ్యంలో ముంబై ఏకంగా ఐదు ట్రోఫీలను గెలిచింది.