బెంగళూరు: కాలిగాయం నుంచి కోలుకున్నాక మళ్లీ బ్యాట్ పట్టిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ (90) తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. పంత్‌తో పాటు లోయరార్డర్ బ్యాటర్లు మెరవడంతో దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరిగిన అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ జట్టు విజయం సాధించింది.
రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా నిర్దేశించిన 275 పరుగుల ఛేదనలో భాగంగా నాలుగో రోజు భారత విజయానికి 156 రన్స్ అవసరమవగా.. పంత్‌కు అండగా బదోని (34), అన్షుల్ కంబోజ్ (37*), తనుష్ కొటియాన్ (23), మానవ్ సుతార్ (20*) రాణించి జట్టును గెలిపించారు.