Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్ దివ్వల మాధురి హౌస్ నుంచి బయటికెళ్లారు. ఈ వారం నామినేషన్లలో రాము, తనూజ, మాధురి, గౌరవ్ గుప్తా, రీతూ చౌదరి, పవన్, సంజన, కళ్యాణ్ ఉన్నారు. వీరిలో ముందుగా పవన్ సేఫ్ అని నాగార్జున ప్రకటించారు. అయితే ఈ వారం ఎపిసోడ్ ప్రత్యేకతగా, బిగ్ బాస్ వేదికపైకి రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి వచ్చారు. తమ సినిమా “ది గర్ల్ ఫ్రెండ్” ప్రమోషన్ సందర్భంగా నాగార్జునతో సరదాగా మాట్లాడుతూ, హౌస్‌మేట్స్‌తో ఆటలలో పాల్గొన్నారు.
ఇంటి సభ్యులు సినిమాల సన్నివేశాలను రీ క్రియేట్ చేస్తూ వినోదం పంచుకున్నారు. కళ్యాణ్–తనూజ జోడీ “పోకిరి” లిఫ్ట్ సీన్ చేయగా, ఇమ్మాన్యుయేల్ “ప్రతి రోజూ పండగే” మూవీలో రావు రమేష్ డైలాగ్‌తో అలరించారు. నామినేషన్ రౌండ్లో సంజన, కళ్యాణ్, రాము, తనూజ వరుసగా సేఫ్ అయ్యారు. చివరికి గౌరవ్ గుప్తా, మాధురి మాత్రమే మిగిలారు. వీరిద్దరిని గార్డెన్లో ఉన్న కారులో కూర్చోబెట్టారు. కారు బయటకు వెళ్ళగా, ఒక్కరు మాత్రమే తిరిగి హౌస్‌లోకి రావాల్సి ఉంది. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం, మాధురి అతి తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయ్యారు.
అయితే తనూజ వద్ద ఉన్న గోల్డెన్ బజర్ ద్వారా ఆమె మాధురిని సేవ్ చేసే అవకాశం ఉంది. కానీ తనూజ మాత్రం “ఇప్పుడే వాడను, తర్వాత వాడతాను” అంటూ మాధురిని సేవ్ చేయకుండా సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో మాధురి హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. బిగ్ బాస్ వేదికపై నాగార్జునను కలిసిన మాధురి, “నేను ఊహించాను… వాస్తవానికి నేనే వెళ్లిపోవాలని అనుకున్నాను. త్వరలో మా ఆయన బర్త్‌డే ఉంది” అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చింది. తనూజ, కళ్యాణ్ పట్ల ప్రేమతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే “హౌస్‌లో ఫేక్ అంటే భరణి గారే… ఆయన బ్యాక్ బిచింగ్ చేస్తారు” అంటూ మాధురి మరో సంచలన వ్యాఖ్య చేసింది. ఇలా దివ్వల మాధురి ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ సీజన్ 9లో మరో ఆసక్తికర మలుపు తిరిగింది. ఇక తనూజ గోల్డెన్ బజర్ ఎప్పుడు, ఎవరికి వాడుతుందో చూడాలి.