IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రోహిత్ శర్మ(Rohit Sharma) టచ్‌లోకి వచ్చాడు. మునపటిలా ఫుల్షాట్లతో అలరిస్తూ రికార్డులు బద్ధలు కొడుతున్న హిట్‌మ్యాన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఎడిషన్‌లో ఈ డాషింగ్ బ్యాటర్ ‘ఇంప్యాక్ట్ ప్లేయర్'(Impact Player)గా తన ముద్ర వేస్తున్నాడు. అయితే.. అభిమానులు మాత్రం రోహిత్ బ్యాటింగ్‌కు మాత్రమే మైదానంలోకి రావడం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అతడికి గాయం అయిందా?.. అందుకే ఫీల్డింగ్‌కు రావడం లేదా?.. అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రోహిత్ వదంతులకు చెక్ పెడుతూ.. జట్టు కోసం ఏదైనా చేసేందుకు సిద్దమేనని స్పష్టం చేశాడు. ‘రెండు మూడు ఓవర్లు పెద్ద ప్రభావం చూపిస్తాయని నేను అనుకోను. అయితే.. ఆరంభం నుంచి కాకుండా చివరి మూడు ఓవర్లు ఫీల్డింగ్ కోసం మైదానంలోకి దిగడం.. చరుకుగా కదలడం కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ, జట్టు ప్రయోజనాల దృష్ట్యా కోచ్, కెప్టెన్, మేనేజ్మెంట్.. అందరూ నన్ను ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా ఆడించడమే మంచిదని భావిస్తున్నారు. వాళ్ల నిర్ణయం మేరకు ఫీల్డింగ్ చేయకుండా నేరుగా బ్యాటింగ్‌కు వచ్చేందుకు నేను సిద్ధమే. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా ఆడుతున్నందుకు నేనేమీ ఇబ్బంది పడడం లేదు. నాకు మా జట్టు విజయమే ముఖ్యం’ అని రోహిత్ వెల్లడించాడు.
Rohit Sharma as Impact Player..!!!! pic.twitter.com/znDaQfnFH9
— Johns. (@CricCrazyJohns) April 17, 2025
ఈ సీజన్లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ప్రతిసారి రోహిత్ ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నాడు. సన్‌రైజర్స్ మ్యాచ్‌తో మొదలు.. వరుసగా మూడుసార్లు ఛేజింగ్‌లో ఓపెనింగ్ చేశాడు. రియాన్ రికెల్టన్‌తో కలిసి శుభారంభాలు ఇస్తూ ముంబై విజయాల్లో కీలకం అవుతున్నాడీ మాజీ సారథి. ఇప్పటివరకూ 7 మ్యాచుల్లో రోహిత్ 158 పరుగులు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై అర్థ శతకంతో విరుచుకుపడ్డ ఈ ఓపెనర్ 76 రన్స్‌తో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదిన రోహిత్ టీ20ల్లో క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు.
The definition of a thumping 𝕎in. 🔥💙#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #MIvCSK pic.twitter.com/2wthARtYFC
— Mumbai Indians (@mipaltan) April 20, 2025