Vijayashanthi | లేడి సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి ఇప్పుడు సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ అలరిస్తుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో సందడి చేసిన విజయశాంతి ఇటీవల వచ్చిన అర్జున్ సన్నాఫ్ విజయశాంతి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన పాత్రతో అదరగొట్టింది. మూవీ ప్రమోషన్స్‌లో కూడా విజయశాంతి చాలా యాక్టివ్‌గా పాల్గొంది. అయితే ఈ సినిమా కోసం విజయశాంతి ఎంత కష్టపడింది అనే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లిగా, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించింది. సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టి అప్పటి కర్తవ్యం విజయశాంతిని గుర్తుచేసింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. అయితే తాజాగా విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది. చిత్రంలో విజయశాంతి ఎంట్రీ సీన్ కి పవర్ ఫుల్ యాక్షన్ ఫైట్ ఉంటుంది. ఫైట్ చివర్లో విజయశాంతి బురదలో పడిపోగా, తాజాగా ఆ సీన్ గురించి ఫైట్ గురించి చెప్పుకొచ్చారు.
ఫైట్ మాస్టర్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు నా పాత కర్తవ్యం, ఫైట్స్ చేసిన సినిమాలు చూడమన్నాను. ఆ సినిమాలు చూసి కొత్త ఫైట్స్ డిజైన్ చేయండి రొటీన్ ఫైట్స్ లేకుండా అని చెప్పాను. అలానే ఫైట్స్ డిజైన్ చేశారు. అయితే నేను చివరలో బురదలో పడిపోతాను. రాత్రి పూట చలికాలంలో షూటింగ్ చేశాం. అది కూడా 9 తర్వాత. సీన్ కోసం రెండు గంటల పాటు బురదలో ఉండాల్సి వచ్చింది. బాగా చలి వేసి బాడీ మొత్తం వణికిపోయింది. అయినప్పటికీ సీన్ అలాగే చేశాను. అంతేకాదు ఈ సినిమా కోసం సంవత్సరం పాటు డైట్ మెయింటైన్ చేశాను. డైట్ మెయింటైన్ చేశాను. రోజూ జిమ్ చేసేదాన్ని. కుదరకపోతే సెట్స్ లోనే జిమ్ చేసేదాన్ని, సెట్ అంతా వాకింగ్ ఒక రౌండ్ వేసేదాన్నిఅని విజయశాంతి ఈ వయస్సులో ఎంత కష్టపడింది అనేది చెప్పుకొచ్చింది.