బేగంపేట, ఏప్రిల్ 22: చట్ట ప్రకారం మైనర్లు డ్రైవింగ్ చేయడం నేరమని ఉత్తర మండలం ట్రాఫిక్ అదనపు డీసీపీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే అందుకు తల్లిదండ్రులు బాధ్యులవుతారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు-నిఆవరణపై ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు వచ్చిన ట్రాఫిక్ ఉల్లంఘనదారుల తల్లిదండ్రులకు రెండు రోజులుగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం నాడు కూడా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు డీసీపీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వాహనదారుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అన్నారు. మైనర్ల డ్రైవింగ్ కేసుల్లో తల్లిదండ్రుల వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు సస్పెండ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అన్ని విధాల వాహన డాక్యుమెంట్లు ఉండాలని, అర్హులైన వారే వాహనాలను ట్రాఫిక్ ఉల్లంఘనలు లేకుండా వాహనాలను నడపాలని సూచించారు.