US Open 2024 : ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన భారత సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న(Rohan Bopanna) మళ్లీ నిరాశపరిచాడు. ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్(US Open 2024)లో క్వార్టర్స్‌కు ముందే అతడి పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌లో ఫేవరేట్ అయిన బోపన్న – మాథ్యూ ఎబ్డెన్ జోడీ మూడో రౌండ్లోనే అనూహ్యంగా ఓటమి పాలైంది.
రెండో సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న – ఎబ్డెన్ జోడీకి ఆదివారం రాత్రి షాక్ తగిలింది. మాగ్జిమో గొంజాలెజ్, అండ్రెస్ మొల్తెనీ జంట చేతిలో బోపన్న ద్వయం కంగుతిన్నది. తొలి సెట్ కోల్పోయిన బోపన్న జోడీ రెండో సెట్లో గట్టిగానే పోరాడింది. కానీ, చివరకు 1-6, 5-7తో ఓటమి తప్పలేదు.
US OPEN: Surprising 1-6 5-7 defeat for 2nd seeds Bopanna/Ebden against the 16th seeded Argentine pair of Gonzalez/Molteni in Round 3
📸 Rhea Nall/USTA pic.twitter.com/a2I7r8mxhD
— Indian Tennis Daily (ITD) (@IndTennisDaily) September 2, 2024
దాంతో, డబుల్స్‌లో తిరుగులేని జంటగా పేరొందిన వీళ్లకు నిరాశే మిగలింది. ఈ ఏడాది ఆరంభంలో బోపన్న – ఎబ్డెన్ జోడీ గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open 2024) టైటిల్‌తో అదరహో అనిపించింది. భారత స్టార్ ఆటగాడైన బోపన్న ఈమధ్యే డేవిస్ కప్(Davis Cup) టోర్నీకి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.