జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌కు(Medigadda barrage) వరద భారీగా పెరుగుతున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్రతో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాల కారణంతో(Heavy rains) ప్రాణహిత, గోదావరి నదులు పొంగుతుం డడంతో సోమవారం బరాజ్ వద్ద ఇన్‌ఫ్లో 6,79,900 క్యూసెక్కులకు చేరుకోగా మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు.
అలాగే బరాజ్‌కు మానేరు, ఇతర చిన్న కాల్వల ద్వారా 6,42,237 క్యూసెక్కుల వరద వస్తుండగా, మొత్తం 66 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి భారీగా పెరిగింది. ఉదయం మూడు లక్షల క్యూసెక్కుల వరద ఉండగా, సాయంత్రానికి అది 7 లక్షలకు చేరుకుంది. గోదావరి గంట గంటకు పెరుగుతుండడంతో అధికారులు అక్కడే ఉంటూ గస్తీ కాస్తున్నారు.