Health Tips : అర్థరైటిస్, ఇన్ఫ్లమేషన్తో బాధపడేవారిని వర్షాకాలం మరింత వేధిస్తుంది. వాతావరణ మార్పులు, తేమ పెరగడం వంటి కారణాలతో వర్షాకాలంలో అర్ధరైటిస్తో బాధపడేవారిలో నొప్పి, వాపు వంటి లక్షణాలు తీవ్రమవుతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలు తీసుకోవడం ద్వారా ఈ లక్షణాల నుంచి కొంత ఉపశమనం పొందవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
వీటిలో పసుపు ముందువరసలో నిలుస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధం జాయింట్ పెయిన్‌ను, స్టిఫ్నెస్ను తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇక అల్లంలో ఉండే జింజరాల్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ పదార్ధాలు శరీరంలో ఇన్ఫ్లమేటరీ మాలిక్యుల్స్ తయారీని నిరోధించడంతో అర్ధరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది.
సల్ఫర్ పదార్ధాలు అధికంగా ఉండే వెల్లుల్లిని తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ బలోపేతమై వర్షాకాలంలో అధికంగా ఉండే ఇన్ఫెక్షన్స్ ముప్పు నుంచి మనల్ని రక్షిస్తుంది. బ్లూ బెర్రీస్, బ్లాక్బెర్రీస్ సహా ఆకుకూరలు, ఆలివ్ ఆయిల్‌ను తరచూ తీసుకోవడం ద్వారా ఈ లక్షణాల నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక వర్షాకాలంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం..
పసుపు
అల్లం
వెల్లుల్లి
బెర్రీస్
ఆకుకూరలు
ఆలివ్ ఆయిల్
నట్స్
ఫ్యాటీ ఫిష్
గ్రీన్ టీ
చియా సీడ్స్
Read More :
Rains | హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. అత్యధికంగా గచ్చిబౌలిలో 97 మి.మీ. వర్షపాతం నమోదు