Rohan Bopanna : భారత డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న(Rohan Bopanna) కీలక నిర్ణయం తీసుకున్నాడు. రెండేండ్ల కాలంగా తనతో ఆడుతున్న భాగస్వామితో తెగతెంపులు చేసుకున్నాడు. అవును.. తన హిట్ జోడీ అయిన ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్ (Mathew Ebden)కు భారత దిగ్గజం గుడ్ బై చెప్పేశాడు.
స్పెయిన్‌లో జరుగుతున్న ఏటీపీ ఫైనల్స్‌లో చివరిసారిగా ఎబ్డెన్తో బరిలోకి దిగిన బోపన్న తమ జోడీ విడిపోతోందని తెలియజేశాడు. ఈ విషయాన్ని ఆదివారం బోపన్న వెల్లడించాడు. నిరుడు జనవరిలో డబుల్స్ భాగస్వామలుగా వీళ్ల ప్రయాణం మొదలైంది.
Finishing with a flourish 🫂❤️@rohanbopanna & @mattebden end their two-year partnership in brilliant fashion, defeating Krawietz/Puetz 7-5 6-7(6) 10-7!#NittoATPFinals pic.twitter.com/5TMZ4OudDo
— ATP Tour (@atptour) November 15, 2024
రెండు ఏండ్లకు పైగా పలు టోర్నీల్లో ఆడిన బోపన్న, ఎబ్డెన్ జోడీ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కొల్లగొట్టింది. దాంతో, 40 ఏండ్ల వయసులో గ్రాండ్‌స్లామ్ గెలుపొందిన ఆటగాడిగా, భారతీయుడిగా బోపన్న చరిత్ర సృష్టించాడు. ఆపై వీళ్ల ద్వయం ఇండియన్ వెల్స్‌లో అదరగొడుతూ ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ కైవసం చేసుకుంది. అనంతరం అదే ఊపులో బోపన్న, ఎబ్డెన్ జోడీ మియామీ ఓపెన్ విజేతగా అవతరించింది.
That’s the end for Indo Aussie pair. They played their final match at #ATPFinals and they won it. Not an ideal tournament for the duo but it’s all well that ends well. Thank you for the wonderful 2 years. @rohanbopanna @mattebden #Atpnextgenfinals #NittoATPFinals @IndTennisDaily https://t.co/EVWeaiwsSj
— Arya Mohite (@AryaMohite53560) November 15, 2024
అయితే.. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ వంటి గ్రాండ్‌స్లామ్స్‌లో బోపన్న జోడీ సత్తా చాటలేకపోయింది. ఇక ఏటీపీ ఫైనల్స్ డబుల్స్ సమరంలోనూ వీళ్ల జంట ఆశించిన స్థాయిలో ఆడేలేదు. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన బోపన్న, ఎబ్బెన్ జంట.. ఎట్టకేలకు విజయంతో టోర్నీని ముగించింది. దాంతో, వీళ్ల డబుల్స్ బంధానికి ఎండ్ కార్డ్ పడింది.