జైపూర్ : రాజస్థాన్ రాయల్స్ సారథిగా యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ నియమితుడయ్యాడు. సుదీర్ఘకాలంగా ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ శాంసన్.. ఈ సీజన్ వేలానికి ముందు చెన్నైకి ట్రేడ్ అవడంతో రాజస్థాన్‌కు కొత్త నాయకుడిని ఎంచుకోవాల్సి వచ్చింది.
2019 నుంచి ఆ జట్టుకు ఆడుతున్న పరాగ్.. నిరుడు ఐపీఎల్ సీజన్లో 8 మ్యాచ్‌ల్లో రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మరి పరాగ్ నాయకత్వంలో అయినా రాజస్థాన్ రెండో ఐపీఎల్ టైటిల్‌ను సాధిస్తుందా? అనేది చూడాలి.