IPL 2025 : ఐపీఎల్లో పవర్ హిట్టింగ్తో చెలరేగిపోతున్నారు కుర్రాళ్లు. బౌలర్ ఎంతటివాడైనా సిక్సర్ల మోతతో స్టేడియాలను హోరెత్తిస్తున్నారు. టైమింగ్ కుదిరిందంటే చాలు బంతిని అలవోకగా స్టాండ్స్‌లోకి పంపుతున్నారు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్(Riyan Parag) అదే పని చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ మోయిన్ అలీ(Moeen Ali)కి చుక్కలు చూపించాడు. వరుసగా 5 బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. లెగ్ సైడ్, స్వీష్ షాట్.. ఇలా అద్భుత షాట్లతో అలరించిన పరాగ్ అరుదైన క్లబ్లో చోటు సంపాదించాడు.
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో ఐదో బ్యాటర్‌గా పరాగ్ రికార్డు సృష్టించాడు. తన విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించిన అతడు రింకూ సింగ్(Rinku Singh) తర్వాత ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్లో ఒకే ఓవర్లు ఐదు సిక్సర్ల వీరుడు మాత్రం క్రిస్ గేల్(Chris Gayle). ఈ చిచ్చరపిడుగు 2012లో లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మను ఉతికేస్తూ ఐదుసార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. 2020లో కింగ్స్ లెవన్ పంజాబ్ పేసర్ కాట్రెల్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియా ఐదు సిక్సర్లతో రికార్డు నెలకొల్పాడు.
📊 Riyan Parag becomes first batter to hit 6 sixes off consecutive deliveries in IPL
5th player to hit five sixes in an over:
♦️ Gayle (vs Rahul, 2012)
♦️ Tewatia (vs Cottrell, 2020)
♦️ Jadeja (vs Harshal in 2021)
♦️ Rinku (vs Dayal in 2023)pic.twitter.com/nHaAYDuXjd— Sportstar (@sportstarweb) May 4, 2025
ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ రవీంద్ర జడేజా. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ అయిన జడ్డూ.. 2021లో ఆర్సీబీ పేసర్ హర్షల్ పటేల్ ఓవర్లో ఐదు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇక.. సిక్సర్ల కింగ్‌గా పేరొందిన రింకూ సింగ్ 2023లో ఈ అరుదైన క్లబ్లో చేరాడు. గుజరాత్ టైటాన్స్ పేసర్ యశ్ దయాల్ వేసిన 20వ ఓవర్లో ఆఖరి 5 బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపాడీ హిట్టర్. దాంతో, ఓటమి అంచున నిలిచిన కోల్‌కతా ఒక వికెట్ తేడాతో జయభేరి మోగించింది.