Pranaam Hospital | ప్రణామ్ హాస్పిటల్స్ వైద్య బృందం మరో అరుదైన ఘనత సాధించింది. మధ్య వయస్సు మహిళకు 8.5 కిలోల భారీ అండాశయ ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించింది. ఆ మహిళకు గత కొన్ని నెలలుగా తీవ్ర పొట్ట నొప్పి, ఊబకాయం, అలసట తదితర లక్షణాలు కనిపించాయి. దాంతో వైద్యలు పలు వైద్య పరీక్షలు, ఇమేజింగ్ ద్వారా భారీ అండాశయ ట్యూమర్ ఉన్న విషయం తేలింది. ట్యూమర్ పరిమాణం, సంక్లిష్టతను దృష్టిలో ఉంచుకుంటే.. ఇది శస్త్రచికిత్సా పరంగా వైద్యులకు పెద్ద సవాల్‌గా నిలిచింది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయడానికి అనేక విభాగాల మధ్య సమన్వయం, ఖచ్చితమైన ప్రణాళికతో వైద్యుల వైద్య బృందం శస్త్ర చికిత్స చేసేందుకు ముందుకు వచ్చింది.
గైనకాలజీ ఆంకాలజిస్టులు, అనస్తీషియా, క్రిటికల్ కేర్ నిపుణులు, శస్త్రచికిత్స బృందం సమష్టి కృషితో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఆపరేషన్ చేసి ట్యూమర్‌ను తొలగించారు. అండాశయ ట్యూమర్లను ముఖ్యంగా ఆలస్యంగా గుర్తిస్తే.. మరింత పెరిగి ప్రాణానికి ముప్పుగా మారే అవకాశం ఉండేదని వైద్యులు పేర్కొన్నారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులకు రోగి కుటుంబీకులు వైద్యులు, ప్రణామ్ హాస్పిటల్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రణామ్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక వైద్య సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు ఉన్నారు. క్లిష్టమైన శస్త్రచికిత్సలలోనూ, సమగ్ర ఆరోగ్య పరిరక్షణలోనూ ప్రణామ్ హాస్పిటల్స్‌కు మంచి పేరున్నది.