IPL 2025 : ధర్మశాలలో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ఆకాశ్ సింగ్(Akash Singh) చెలరేగుతున్నాడు. రెండు కీలక వికెట్లు తీసి పంజాబ్ కింగ్స్ స్కోర్ బోర్డుకు బ్రేకులు వేశాడీ స్పీడ్‌స్టర్. తొలి ఓవర్లోనే డేంజరస్ ప్రియాన్ష్ ఆర్య(1)ను ఔట్ చేసిన ఆకాశ్.. 5వ ఓవర్లో జోష్ ఇంగ్లిస్(30)ను పెవిలియన్‌కు పంపాడు. బౌండరీ వద్ద మిల్లర్ చక్కని క్యాచ్‌తో ఇంగ్లిస్ డగౌట్ చేరాడు. ప్రస్తుతం ప్రభ్‌సిమ్రన్ సింగ్(29), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6) క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 66-2.
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు కీలక పోరులో శుభారంభం లభించలేదు. విధ్వంసక ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(1) తొలి ఓవర్లోనే ఔటయ్యాడు. ఆకాశ్ సింగ్ వేసిన బంతిని అతడు థర్డ్ మ్యాన్ దిశగా ఆడగా మయాంక్ ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన జోష్ ఇంగ్లిస్(30) ధనాధన్ ఆడాడు.
Straight into the action 👊
Akash Singh wastes no time as he delivers the opening blow on his #LSG debut!
Updates ▶ https://t.co/YuAePC273s#TATAIPL | #PBKSvLSG pic.twitter.com/csBenSwtHu
— IndianPremierLeague (@IPL) May 4, 2025
మయాంక్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లతో పంజాబ్ స్కోర్ బోర్డును ఉరికించాడు. అయితే.. ఈ చిచ్చరపిడుగును ఆకాశ్ వెనక్కి పంపాడు. ఇక, 21 పరుగుల వద్ద ప్రభ్‌సిమ్రన్‌కు లైఫ్ లభించింది. అవేశ్ ఖాన్ ఓవర్లో అతడు గాల్లోకి లేపిన బంతిని పూరన్ అందుకోలేకపోయాడు.