ఊట్కూర్ : తాము చదివిన పాఠశాలను అభివృద్ధి ( School Development ) చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తామని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు అన్నారు. పాఠశాలలో 1987 ఎస్ఎస్సీ బ్యాచ్ ( SSC Batch ) పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. చదువు పూర్తయి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు 38 ఏళ్ల అనంతరం ఒకే చోట కలుసుకుని తరగతి గదుల అనుభూతులను నెమరు వేసుకున్నారు.
విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు లక్ష్మణ్, సుభాష్ రావు, వెంకట్రాములును శాలువాతో సన్మానించి పాదాభివందనం చేశారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాధాకృష్ణ, సురేష్ రావు, దొడ్డి శ్రీనివాసులు, చంద్రశేఖర్, సోమిరెడ్డి, గుడికాడి హనుమంతు, శంకర్, దత్తు రావు, గోపాల్, వెంకట్ రెడ్డి, గురు లింగం రాజు, మోనమ్మ, అంజిలమ్మ, విజయలక్ష్మి, వెంకటమ్మ పాల్గొన్నారు.