Black Cardamom | మన వంటి ఇంటి మసాలా దినుసుల్లో యాలకులు కూడా ఒకటి. యాలకులను ఎక్కువగా మసాలా వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు మంచి రుచి, వాసన వస్తాయి. యాలకులను కేవలం కారం వంటకాల్లోనే కాకుండా తీపి వంటకాల్లోనూ వేస్తుంటారు. అయితే సాధారణంగా మనకు ఆకుపచ్చని యాలకులు లభిస్తాయి. కానీ వీటిల్లోనూ అనేక రకాలు ఉంటాయి. మనకు మార్కెట్లో లభించే యాలకుల్లో నల్ల యాలకులు కూడా ఒకటి. ఇవి ఆకుపచ్చని యాలకుల కన్నా భిన్నమైన వాసనను, రుచిని కలిగి ఉంటాయి. ఆకుపచ్చని యాలకులు తియ్యని వాసనను, రుచిని కలిగి ఉంటే నల్ల యాలకులు కాస్త ఘాటుగా ఉంటాయి. వీటిని కూడా కొందరు మసాలా వంటకాల్లో వేస్తుంటారు. నేపాలీయులు కూడా తమ వంటల్లో నల్ల యాలకులను ఉపయోగిస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం నల్ల యాలకులు మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
నల్ల యాలకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగుతుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాస మార్గాల్లో ఉండే అడ్డంకులు పోయి శ్వాస బాగా లభిస్తుంది. ఆస్తమా ఉన్నవారు కూడా ఈ నీళ్లను తాగుతుంటే ఉపశమనం పొందవచ్చు. బ్రాంకైటిస్ ఉన్నవారికి కూడా నల్ల యాలకులు మేలు చేస్తాయి. భోజనం చేసిన అనంతరం ఒక నల్ల యాలక్కాయను నోట్లో వేసుకుని అలాగే నమిలి తినాలి. దీంతో జీర్ణాశయంలో ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తాయి. దీంతో అజీర్తి తగ్గుతుంది. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. జీర్ణాశయంలో ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి అవకుండా అడ్డుకోవచ్చు. దీంతో అసిడిటీ తగ్గిపోతుంది.
రాత్రి పూట భోజనం చేసిన అనంతరం ఒక నల్ల యాలక్కాయను నోట్లో వేసుకుని నమిలి తింటుండాలి. దీని వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, నోరు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ల నుంచి కారే రక్త స్రావం తగ్గుతుంది. దంతాల నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. నల్ల యాలకులను రోజూ తింటుంటే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి నల్ల యాలకులు ఎంతో మేలు చేస్తాయి. నల్ల యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే పొటాషియం కూడా ఎక్కువగానే లభిస్తుంది. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదం చేస్తాయి. పలు అధ్యయనాలు చెబుతున్న ప్రకారం నల్ల యాలకులను తరచూ తింటుంటే రక్త నాళాల్లో క్లాట్స్ ఏర్పడకుండా అడ్డుకోవచ్చు. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
నల్ల యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫలితంగా క్యాప్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. నల్ల యాలకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కనుక వీటిని తింటే ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాపులు కూడా తగ్గిపోతాయి. నల్ల యాలక్కాయలను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. కనుక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. వ్యాధులు తగ్గిపోతాయి. వైరల్ ఫీవర్ నుంచి త్వరగా కోలుకుంటారు. నల్ల యాలకులను తింటే లివర్ పనితీరు మెరుగు పడుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా వీటితో అనేక లాభాలను పొందవచ్చు.