ఢిల్లీ : ఐపీఎల్ కొత్త సీజన్లో ఆరంభ మ్యాచ్‌లను రాజస్థాన్ రాయల్స్ తమ రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ నేతృత్వంలో కాకుండా యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ కెప్టెన్సీలో ఆడనుంది. తొలి మూడు మ్యాచ్‌లకు పరాగ్ సారథిగా వ్యవహరిస్తాడని గురువారం రాజస్థాన్ మేనేజ్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. సంజూ జట్టుతో ఉన్నా ప్యూర్ బ్యాటర్‌గానే కొనసాగుతాడు.