Riyan Parag: టీ20లలో రియాన్ పరాగ్ నయా చరిత్ర.. తోపులకు సాధ్యం కాని రికార్డు సొంతం
Riyan Parag: సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్) లో భాగంగా అస్సాం జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న పరాగ్.. వరుసగా ఆరు మ్యాచ్‌లలో అర్థ సెంచరీలు సాధించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.
Riyan Parag: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడే రియాన్ పరాగ్ టీ20 ఫార్మాట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్) లో భాగంగా అస్సాం జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న పరాగ్.. వరుసగా ఆరు మ్యాచ్‌లలో అర్థ సెంచరీలు సాధించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. స్మాట్‌లో భాగంగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వేదికగా కేరళతో ముగిసిన మ్యాచ్‌లో అర్థ సెంచరీ సాధించడంతో పరాగ్.. వరుసగా ఆరో హాఫ్ సెంచరీ పూర్తిచేసిన క్రికెటర్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. అంతర్జాతీయ టీ20లలో విధ్వంసక బ్యాటర్లుగా ఉన్న క్రికెటర్లకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ముస్తాక్ అలీ ట్రోఫీ కంటే ముందు దేశవాళీలో భాగంగా జరిగిన దేవదార్ ట్రోఫీలో కూడా 102, 95 పరుగులతో రాణించాడు.
ఇక స్మాట్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లోనే 45 పరుగులు చేసిన పరాగ్.. తర్వాత ఆరు మ్యాచ్‌లలో వరుసగా 61, 76, 53, 76, 72, 57 పరుగులో విజృంభించాడు. బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణిస్తున్న పరాగ్.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. రెండో మ్యాచ్ నుంచి పరాగ్.. మొత్తం తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.
Riyan Parag in Syed Mushtaq Ali 2023:
45(19) & 0/53(4)
61(34) & 2/25(4)
76*(37) & 3/6(4)
53*(29) & 1/17(4)
76(39) & 1/37(4)
72(37) & 1/35(3)
57*(33) & 1/17(4)He is ruling Syed Mushtaq Ali, just 21 years old, incredible consistency in the league…..!!!! pic.twitter.com/k0V9ArlDYO
— Johns. (@CricCrazyJohns) October 27, 2023
దేశవాళీలో నిలకడగా ఆడుతున్న పరాగ్.. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఐపీఎల్లో భారీ ధర దక్కించుకునే అవకాశముంది. అంతేగాక జాతీయ జట్టులో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఐపీఎల్ గత సీజన్లో పరాగ్ ఫామ్ కోల్పోవడంతో ఎక్కువ మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

