ముంబై: నాలుగు నెలల స్వల్ప విరామం తర్వాత యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈనెల 14 నుంచి సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు గాను అజిత్ అగార్కర్ సారథ్యంలోని జాతీయ మెన్స్ సెలక్షన్ కమిటీ బుధవారం జట్టును ప్రకటించగా అందులో పంత్.. వైస్ కెప్టెన్‌గా పునరాగమనం చేశాడు.
శుభ్‌మన్ గిల్ సారథిగా వ్యవహరిస్తున్న 15 మంది జట్టులో.. వెస్టిండీస్ సిరీస్‌లో ఉన్న ప్రసిద్ధ్ కృష్ణ, ఎన్. జగదీశన్‌పై వేటు పడగా ఆకాశ్ దీప్ కూడా జట్టులోకి వచ్చాడు. ఈ రెండు మార్పులు తప్ప విండీస్‌తో ఆడిన జట్టునే సెలక్టర్లు కొనసాగించారు. రంజీలో సత్తాచాటుతున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీతో పాటు ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. నవంబర్ 14న ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్.. సఫారీలతో తొలి టెస్టు ఆడనుంది.
భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్.