Rishabh Pant : చిన్నస్వామి స్టేడియంలో తన మెరుపులతో అభిమానులను అలరించిన రిషభ్ పంత్ (Rishabh Pant ) సెంచరీకి ముందు ఔటయ్యాడు. న్యూజిలాండ్ (Newzealand) బౌలర్లను ఊచకోత కోసిన పంత్ అనూహ్యంగా 99 వద్ద బౌల్డయ్యాడు. విలియం ఓరూర్కీ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేయగా.. అది ఎడ్జ్ తీసుకొని లెగ్ స్టంప్స్‌కు తాకింది. అంతే.. స్టేడియంలోని అభిమానులు, డ్రెస్సింగ్ రూమ్‌లోని భారత ఆటగాళ్లు ‘అయ్యో.. పంత్ ఔటయ్యావా? ‘ అంటూ నెత్తికి చేతులు పెట్టారు.
సుదీర్ఘ ఫార్మాట్లో పంత్ ఇలా 90ల్లో ఔట్ కావడం ఇది ఏడోసారి. అయితే.. అతడి కంటే ముందు పలువురు భారత దిగ్గజాలు 90ల్లో వెనుదిరిగి శతకం చేజార్చుకున్నారు. వీళ్లలో ఎవరిది రికార్డు అంటే.. ఇంకెవరు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar). అవును తన క్లాస్ ఇన్నింగ్స్‌లతో రికార్డులు బద్ధలు కొట్టిన సచిన్ 90ల్లో 10 సార్లు ఔటయ్యాడు.
It’s 💔 in the nineties again for Rishabh Pant ☹️https://t.co/tzXZHnJhUa #INDvNZ pic.twitter.com/Ix9OSOa0fn
— ESPNcricinfo (@ESPNcricinfo) October 19, 2024
‘ది వాల్’గా పేరొందిన రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) 9 పర్యాయాలు 90ల్లో వికెట్ పారేసుకొని రెండో స్థానంలో నిలవగా.. పంత్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక.. మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar), వీరేంద్ర సెహ్వాగ్, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీలు 5 సార్లు సెంచరీకి ముందు 90ల్లో ఔటయ్యారు.