Bomb Threats | విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం సైతం పలు విమానాల్లో బాంబులు పెట్టినట్లుగా బెదిరింపులు వచ్చాయి. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బాంబు బెదిరింపులు వచ్చిన విమానాల్లో మూడు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు కాగా.. మరికొన్ని విమానాలు ఆకాశ ఎయిర్‌కు చెందినవి ఉన్నాయి. అయితే, ఎన్ని విమానాలకు బెదిరింపులు వచ్చాయో మాత్రం చెప్పలేదు. బెదిరింపుల నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది. మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయని చెప్పింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్ వెళ్లే తమ విమానం 6ఈలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు ఉన్నాయని పేర్కొంది.
ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా ప్రాధాన్యత అని పేర్కొంది. సంబంధిత అధికారులతో కలిసి పని చేస్తున్నామని.. మార్గదర్శకాల ప్రకారం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముంబయి-ఇస్తాంబుల్ మధ్య నడిచే ఇండిగో ఎయిర్‌లైన్స్ 6ఈ 17 విమానం, జోధ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లే 6ఈ 184 ఫ్లైట్‌కు బెదిరింపులు వచ్చాయని చెప్పింది. విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయని.. ప్రయాణికులను సురక్షితంగా దింపామని చెప్పింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ 6ఈ 108 విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చిందని.. విమానం చండీగఢ్ చేరుకోగానే ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని డీబోర్డ్‌కు తరలించినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఆకాసాకు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు బెదిరింపులు వచ్చాయని కంపెనీ పేర్కొంది.
ఎయిర్ ఎమర్జెన్సీ టీం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది, అన్ని భద్రతా ప్రోటోకాల్‌లు, మార్గదర్శకాలను అనుసరిస్తున్నట్లు ఎయిర్‌లైన్ వెల్లడించింది. ఈ వారంలో ఇప్పి వరకు వివిధ ఎయిర్‌లైన్స్‌లకు చెందిన విమానాల్లో బాంబు పెట్టినట్లుగా దాదాపు 40 వరకు బెదిరింపులు వచ్చాయి. నిరంతరం వస్తున్న బెదిరింపుల కారనంగా విమానయాన సంస్థలతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. బెదిరింపులతో భయానకర వాతావరణం నెలకొంటున్నది. ఇంతకుముందు ఆసుపత్రులు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు రాగా.. ప్రస్తుతం విమానాలు, ఎయిర్‌పోర్ట్‌లకు బెదిరింపులు కొనసాగుతున్నాయి. విమానాలకు వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో అధికార బీజేపీపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.