Rishabh Pant : ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. 16 సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలం(Mini Auction) మరికొన్ని గంటల్లో మొదలవ్వనుంది. దుబాయ్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి వేలంపాట షురూ కానుంది. ఫేమస్ ఆక్షనీర్ మల్లికా సాగర్ (Mallika Sagar) నిర్వహించే వేలంలో కోట్లు కొల్లగొట్టేది ఎవరు? అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
అయితే.. మామూలుగా ఫ్రాంజైజీల యజమానులు, మెంటార్లు, కోచ్‌లు వేలం పాటలో పాల్గొంటారు. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్(Rishabh Pant) కూడా భాగమవుతున్నాడు. ఇప్పటికే అతడు దుబాయ్ చేరుకున్నాడు. వేలంలో ఎవరిని కొనాలి? ఎంత ధర పెట్టొచ్చు? వంటి విషయాలపై పంత్.. కోచ్ రికీ పాంటింగ్(Ricky Ponting)తో కలిసి చర్చించాడని ఢిల్లీ ఫ్రాంచైజీ అధికారి ఒకరు తెలిపారు.
Stop everything and watch this interview 📽️
Presenting Rishabh Pant who’s going to be on the #DC auction table for the first time EVER 🤗
P.S – We are so happy to see Rishabh BACK 🥹#IPL | @RishabhPant17 | @DelhiCapitals pic.twitter.com/4j6TWIrZsf
— IndianPremierLeague (@IPL) December 19, 2023
నిరుడు యాక్సిడెంట్ కారణంగా ఆటకు దూరమైన పంత్ ఐపీఎల్ వేలం పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. అతడి పాటు మాజీ సారథి గౌతం గంభీర్ కోల్‌కతా మెంటార్‌గా వేలం ప్రక్రియలో పాల్గొననున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆకాశ్ అంబానీ, పంజాబ్ కింగ్స్ నుంచి నెస్ వాడియా.. మిగతా ఫ్రాంచైజీల యజమానులు యాక్షన్‌లో గెలుపు గుర్రాల కోసం పోటీ పడనున్నారు.
రిషభ్ పంత్, రికీ పాంటింగ్
ఈసారి 1,166 మంది ఆటగాళ్లు వేలంలో పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. వీళ్లలో 830 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. ఈ మొత్తం జాబితాలో 212 మంది క్యాప్డ్ ఆటగాళ్లు కాగా.. 909 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు. అన్ని ఫ్రాంచైజీలు మొత్తంగా ఈసారి 262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి. నిరుడు కొచ్చిలో జరిగిన మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్(Sam Curran) రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే.