Volcanic Eruption | ఐస్లాండ్లో పేలిన అగ్నిపర్వతం..
అల్టాంటిక్ మహాసముంద్రంలోని ద్వీపదేశమైన ఐస్లాండ్లో (Iceland) అగ్నిపర్వతం పేలింది. సోమవారం రాత్రి రేక్జాన్స్ ద్వీపకల్పంలో అగ్నిపర్వత విస్ఫోటనం (Volcanic Eruption) ప్రారంభమైందని అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ: అల్టాంటిక్ మహాసముంద్రంలోని ద్వీపదేశమైన ఐస్లాండ్లో (Iceland) అగ్నిపర్వతం పేలింది. సోమవారం రాత్రి రేక్జాన్స్ ద్వీపకల్పంలో అగ్నిపర్వత విస్ఫోటనం (Volcanic Eruption) ప్రారంభమైందని అధికారులు తెలిపారు. భూమి కింద శిలాద్రవం మారడంతో రేక్జాన్స్ (Reykjanes) పీఠభూమిలో పెద్ద సంఖ్యలో చిన్నపాటి భూకంపాలు నమోదయ్యాయి. దీంతో హగాఫెల్కు దగ్గరగా ఉన్న అగ్నిపర్వతం పేలిందన్నారు. ఆ ప్రాంతంలో పెద్దఎత్తున బూడిదను వెదజల్లిందని, లావా ప్రవహిస్తున్నదని చెప్పారు.
సోమవారం రాత్రి 9 గంటలకు భూ కంపాలు వచ్చాయని, 10.17 గంటలకు అగ్నిపర్వతం బద్దలయిందని ఐస్లాండ్ వాతావరణ శాఖ తెలిపింది. అగ్నిపర్వతం ఎక్కడ పేలిందనే విషయాన్ని నిర్ధారించడానికి కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్ బయల్దేరిందని పేర్కొంది. తీవ్రమైన భూకంపాల తర్వాత ఐస్లాండ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతుందని గత నెలలోనే హై అలర్ట్ జారీచేశారు. ఈనేపథ్యంలో రాజధాని నుంచి 40 కిలోమీటర్ల దూరంలో గ్రిందావిక్లో ఉంటున్న 4 వేల మంది నివాసితులను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యూరప్‌లో అత్యధికంగా ఐస్లాండ్లో 33 క్రియాశీలక అగ్నిపర్వతాలున్నాయి.

Byrjunin á eldgosinu á vefmyndavél RÚV yfir Grindavík
0:13 pic.twitter.com/Jx3icbxuxx
— Birkir (@birkirh) December 18, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Earthquake
- Europe
- Grindavik
- Iceland
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

