BCCI : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌కు ముందే ఇంటిదారి పట్టిన భారత జట్టు (Team India) సొంతగడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ (ICC Womens Championship)లో భాగంగా న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే వన్డేల మ్యాచ్‌ల తేదీలను ప్రకటించిన బీసీసీఐ గురువారం స్క్వాడ్‌ను వెల్లడించింది. వరల్డ్ కప్ జట్టులోని ముగ్గురిని తప్పిస్తూ 16 మందితో కూడిన బృందాన్ని సెలెక్టర్లు ఎంపిక చేశారు.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు మరో అవకాశం ఇస్తూ ఆమెకే పగ్గాలు అప్పగించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మూడు మ్యాచ్‌లకూ ఆతిథ్యం ఇవ్వనుందని బీసీసీఐ తెలిపింది. వరల్డ్ కప్‌లో దారుణంగా విఫలమైన రీచా ఘోష్, పేసర్ పూజా వస్త్రాకర్, ఆశా శోభనలు ఈ సిరీస్‌లో ఆడడం లేదు. మెగా టోర్నీలో గాయపడిన రీచా, పూజాలు తాము అందుబాటులో ఉండడం లేదని సెలెక్టర్లకు చెప్పారు. దాంతో, వాళ్ల స్థానంలో మరొకరిని ఎంపకి చేయాల్సి వచ్చింది.
A look at #TeamIndia’s squad for the three-match ODI series against New Zealand 👌👌 #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/pKxdLCWsnb
— BCCI Women (@BCCIWomen) October 17, 2024
భారత స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, హేమలత, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), ఉమా ఛెత్రీ(వికెట్ కీపర్), సయాలీ సట్గరే, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, తేజల్ హసబిన్స్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్.
భారత్, న్యూజిలాండ్‌ల మధ్య అక్టోబర్ 24న తొలి వన్డే మధ్నాహ్నం 1:30 గంటలకు మొదలవ్వనుంది. ఆ తర్వాత 27, 29వ తేదీన చివరి రెండు వన్డేలు నిర్వహించనున్నారు. ఈ సిరీస్ మన అమ్మాయిలకు ఎంత ముఖ్యమో కివీస్‌కు కూడా అంతే ముఖ్యం. వచ్చే ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించాలంటే న్యూజిలాండ్ జట్టుకు గెలిచి తీరాల్సిందే. ప్రస్తుతానికైతే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు వరల్డ్ కప్ బెర్తు సొంతం చేసుకున్నాయి.