SAW vs AUSW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మోస్తర్ స్కోర్ కొట్టింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. అయితే.. వికెట్ కీపర్ బేత్ మూనీ(44) సాధికారిక ఇన్నింగ్స్ ఆడింది. విధ్వంసక ఆల్‌రౌండర్ హిట్టర్ ఎలీసా పెర్రీ(31), కెప్టెన్ తహ్లియా మెక్‌గ్రాత్(27) ఫొబే లిచ్‌ఫీల్డ్(16 నాటౌట్)ల మెరుపులతో ప్రత్యర్థికి కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత ఓవర్లలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.
లీగ్ దశలో దుమ్మురేపిన ఆస్ట్రేలియా బ్యాటర్లు సెమీ ఫైనల్లో దంచలేకపోయారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైంది. టాస్ గెలిచిన సఫారీ సారథి లారా వొల్వార్డ్త్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు చెలరేగారు. డేంజరస్ ఓపెనర్ గ్రేస్ హ్యారిస్(1)ను ఔట్ చేసిన ఖాక సఫారీలకు బ్రేకిచ్చింది. ఆ తర్వాత జార్జియా వరేహం(5)ను మరినే కాప్ పెవిలియన్ పంపింది. దాంతో, 18 పరుగులకే రెండు కీలక వికెట్లు పడ్డాయి. ఆ దశలో బేత్ మూనీ(44) అండగా కెప్టెన్ తహ్లియా మెక్‌గ్రాత్(27) కీలక ఇన్నింగ్స్ ఆడింది.
🔥 40 runs in the last four overs!
Strong finish from Perry and Litchfield 👏
FOLLOW: https://t.co/WAgm3oN9pc | #T20WorldCup pic.twitter.com/cyGAy0l8yu
— ESPNcricinfo (@ESPNcricinfo) October 17, 2024
సఫారీ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వని ఆమె భారీ షాట్లకు వెళ్లకుండా స్కోర్‌బోర్డును నడిపించింది. అయితే.. లాబా ఓవర్లో మెక్‌గ్రాత్ ఇచ్చిన క్యాచ్‌ను డెర్కెసెన్ సులువుగా అందుకుంది. అంతే.. 68 వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. ఇక ఆస్ట్రేలియా స్కోర్ 100 దాటడం కష్టమే అనుకన్న వేళ.. మూనీ కూడా రనౌట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఆల్‌రౌండర్ ఎలీసా పెర్రీ(31), ఫొబే లిచ్‌ఫీల్డ్(16 నాటౌట్)లు ధాటిగా ఆడారు. ఆఖరి ఓవర్లలో బౌండరీలతో విరుచుకుపడి జట్టుకు స్కోర్ 130 దాటించారు.