Suriya 44 | తమిళ స్టార్ నటుడు సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. సూర్య44 రానున్న ఈ ప్రాజెక్ట్‌లో కథానాయికగా బుట్టబోమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ మూవీ అనౌన్స్మెంట్ 2024 మార్చి 28న ప్రారంభమైన విషయం తెలిసిందే. జూన్ 02న షూటింగ్ స్టార్ట్ చేయగా.. అక్టోబర్ 06న షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ చిత్రం. అయితే ఈ సినిమా విడుదల తేదీపై తాజాగా స్పందించాడు దర్శకుడు కార్తీక్.
ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇంకా పోస్ట్ ప్రోడక్షన్ పనులు, మ్యూజిక్ పనులు ఉన్నాయి. ప్రెషర్ లేకుండా ఇవి కంప్లీట్ చేసుకొని 2025 సమ్మర్ వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కార్తీక్ వెల్లడించాడు. ఇక ఈ సినిమాలో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఈ చిత్రానికి దసరా ఫేం సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందించనున్నాడు.
#Suriya44 Summer 2025 release confirmed by Karthiksubbaraj ✅
“Eventhough we have finished the shooting, we need time for post production & Music. So planning for Summer release 🔥”pic.twitter.com/aWBGbf70jq
— AmuthaBharathi (@CinemaWithAB) October 17, 2024