IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందే మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)కు పెద్ద షాక్. బౌలింగ్ కోచ్‌గా సేవలందిస్తున్న పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ (Dale Steyn) ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పేశాడు. తాను వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండనని ఈ దక్షిణాఫ్రికా లెజెండ్ ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి స్పష్టం చేశాడు.
‘బౌలింగ్ కోచ్‌గా కొన్ని ఏండ్లు నన్ను కొనసాగించినందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ధన్యవాదాలు. అయితే.. దురదృష్టవశాత్తూ నేను ఐపీఎల్ 2025కి అందుబాటులో ఉండడం లేదు. కానీ, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతాను’ అని స్టెయిన్ తన ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించాడు. స్టెయిన్ స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన జేమ్స్ ఫ్రాంక్లిన్ (James Franklin)కు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది హైదరాబాద్ ఫ్రాంచైజీ.
🚨Dale Steyn Bids Farewell to Sunrisers Hyderabad, Continues with Sunrisers Eastern Cape! pic.twitter.com/tCpMW1OVL2
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) October 17, 2024
ప్రపంచంలోని మేటి పేసర్లలో ఒకడైన స్టెయిన్ ఐపీఎల్‌లోనూ బ్యాటర్లను వణికించాడు. సన్‌రైజర్స్ మాజీ ఆటగాడైన అతడు 2022లో ఆ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వచ్చాడు. సుదీర్ఘ అంతర్జాతీయ, ఐపీఎల్ అనుభవం గల అతడు యువకెరటం ఉమ్రాన్ మాలిక్‌ను గొప్పగా తీర్చిదిద్దాడు. అతడి హయాంలో రాటుదేలిన ఉమ్రాన్ జాతీయ జట్టులోకి సైతం వచ్చాడు. ఇక.. 17వ సీజన్లో స్టెయిన్ తన వ్యూహాలతో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని బౌలింగ్ యూనిట్‌ను దుర్భేద్యంగా మర్చాడు. కానీ.. తీరా ఫైనల్లో హైదరాబాద్ జట్టు చెత్త ఆటతో ఓడిపోయి రెండో ట్రోఫీ అందకొనే అవకాశాన్ని చేజార్చుకుంది.