గౌహతి: అగర్తల-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. (Train Derail In Assam) రైలు ఇంజిన్, ఎనిమిది కోచ్‌లు ఒక పక్కకు ఒరిగిపోయాయి. రైలు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అస్సాంలోని దిబోలాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. త్రిపుర రాజధాని అగర్తల నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబైకి వెళ్తున్న అగర్తల-లోక్మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. గురువారం మధ్యాహ్నం 3:55 గంటలకు అస్సాంలోని దిబోలాంగ్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. లుండింగ్, బాదర్పూర్ హిల్ సెక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్‌తోపాటు ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పి ఒక వైపునకు ఒరిగిపోయాయి. ఈ సంఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
కాగా, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ సంఘటన స్థలానికి చేరుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రైలు ఇంజిన్, ఎనిమిది బోగీలు పట్టాలు తప్పినట్లు వివరించారు. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం నమోదు కాలేదని చెప్పారు. ఈ సంఘటన నేపథ్యంలో లుమ్డింగ్-బాదర్పూర్ సెక్షన్లో రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Agartala–Lokmanya Tilak Terminus Express that left #Agartala today morning derailed at Dibalong station under Lumding division in the Lumding-Bardarpur Hill section at about 15-55 hrs.08(eight)coaches including the power car and the Engine of the train got derailed@DDNewslive pic.twitter.com/e5ckSu9r68
— DD News Tripura (@ddnewsagartala) October 17, 2024