Samantha – Ye Maya Chesave | ఏ మాయ చేసావె చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన సమంత ఆ తరువాత వెనుతిరిగి చూసుకోలేదు. అనతి కాలంలోనే అగ్ర హీరోలందరితోనూ నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కేవలం సమంత డేట్స్ కోసం హీరోలు ఎదురుచూసేంత క్రేజ్‌ను సంపాందించుకున్నారు ఆమె. ఇక నాగచైతన్యతో ప్రేమ వివాహాం ఆ తరువాత విడాకులు ఇవన్నీ తెలిసిందే. ఇటీవల ఆమె మయెసైటిస్ అనే అరుదైన వ్యాధి నుంచి కోలుకున్నారు. యోగ, ధ్యానం ఇలా అన్ని క్రమశిక్షణతో సాధన చేసి ప్రస్తుతం ఆమె పూర్తి ఫిట్నెస్తో వున్నారు. కాగా సమంత నటించిన సిటాడెల్ హన్ని బన్నీ వెబ్‌సీరిస్ కూడా త్వరలోనే అమోజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇటీవల తమ తొలి సినిమా అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశారు.
“ఏమాయ చేసావె” చిత్రంలో మొదటిసారి నన్ను నేను వెండితెర మీద చూసుకుని ఏడ్చేశాను. అయితే అది ఆనందంతో కాదు. బాధతో.. జెస్సీ క్యారెక్టర్లో నేను బాగాలేను అనేది నా ఫీలింగ్. ఆ క్షణం నాకు నేను నచ్చలేదు. కానీ జెస్సీ అనే పాత్ర, ఏమాయ చేసావె అనే చిత్రం నా జీవితాన్ని మార్చేసింది .అసలు నటిని అవుతానని ఊహించని నాకు వరుసగా మూడు సక్సెస్‌లు రావడం నిజంగా నాకే ఆశ్చర్యంగా అనిపించింది. అయితే ఇప్పటికైనా నాకు దక్కిన స్టార్ డమ్‌ని నా ప్రతిభ కంటే అదృష్టంగానే భావిస్తాను.ఎంతో మంది నా కంటే టాలెంట్ వున్న వాళ్లు, అందమైన వాళ్లు సినీ పరిశ్రమలో, బయట కూడా వున్నారు. ఎందరికో ఊరించే విజయం, అదృష్టం నాకు దక్కింది. ఇది దేవుడు నాకు ఇచ్చిన బహుమనం. ఇదేదో నేను సాధించినదేమీ కాదు. ఇచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్లిపోయాను. ఫలితం గురించి ఆలోచించకున్న అంతా నాకు మంచే జరిగింది’ అంటూ చెప్పుకొచ్చారు సమంత.