INDW vs SLW : విశ్వవిజేతగా స్వదేశంలో తొలి సిరీస్‌లో టీమిండియాకు శ్రీలంక పోటీ ఇవ్వలేకపోతోంది. వైజాగ్‌లో పేలవ ఆటతో చావుదెబ్బతిన్న లంక త్రివేండ్రంలోనూ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. సిరీస్‌లో నిలవాలంటే గెలవక తప్పని పోరులో రేణుకా సింగ్(4-21) విజృంభణతో పర్యాటక జట్టు టాపార్డర్ కుప్పకూలింది. హాసిని పెరీరా(25), ఇమేశా దులానీ (27) రాణించడంతో లంక గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలుపొందిన భారత్.. 113 రన్స్ కొడితే మరో రెండు మ్యాచ్‌లుండగానే సిరీస్ పట్టేస్తుంది.
వైజాగ్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన శ్రీలంక చావోరేవో పోరులోనూ చిన్న స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడిన ఆ జట్టు ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభించింది. ఓపెనర్ హాసిని పెరీరా( హాసిని పెరీరా(25) బౌండరీలతో చెలేరగడంతో స్కోర్ దాటింది. అయితే.. దీప్తి శర్మ(3-18) ఓవర్లో చమరి ఆటపట్టు(3)ను ఔట్ చేసి దీప్తి శర్మ తొలి బ్రేకిచ్చింది. ఆ తర్వాత ఆరో ఓవర్లో రేణుకా సింగ్(4-21) పెరారీతో పాటు డేంజరస్ హర్షిత సమరవిక్రమ(2)లను వెనక్కి పంపింది. దాంతో.. 32కే లంక మూడు బిగ్ వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో కూరుకుపోయింది.
Making her experience count ✨
🎥 Deepti Sharma’s 1⃣5⃣0⃣th T20I wicket! 👏
Updates ▶️ https://t.co/Vkn1t7b6Dm#TeamIndia | #INDvSL | @IDFCFIRSTBank | @Deepti_Sharma06 pic.twitter.com/ENsNn9fmBm
— BCCI Women (@BCCIWomen) December 26, 2025
కీలక బ్యాటర్లు ఔట్ కావడంతో కష్టాల్లో పడిన లంకను ఇమేశా దులానీ (27) ఆదుకుంది. అయితే.. ఆమెతో కలిసి భాగస్వామ్యంతో జట్టును ఆదుకోవాలనుకున్న నీలాక్షి డిసిల్వా(4)ని రేణుక ఎల్బీగా పెవిలియన్ చేర్చింది. దాంతో.. 10 ఓవర్లకు లంక స్కోర్. 45-4. క్రాంతి గౌడ్, దీప్తి ఓవర్లో ఫ్రంట్‌ఫుట్‌లో… స్వీప్ షాట్లతో విరుచుకుపడిన దులానీ.. కవిశ దిల్మరి(20) తో కలిసి స్కోర్ బోర్డును ఉరికించింది. 26 బంతుల్లో 40 రన్స్ పిండుకున్న ఈ ద్వయ్నా దీప్తి విడదీసింది. సిక్సర్‌కు యత్నించిన దిల్హరి బౌండరీ వద్ద అమన్‌జోత్ చేతికి చిక్కడంతో 85 వద్ద ఐదో వికెట్ పడింది. కాసేపటికే దులానీని రేణుక వెనక్కి పంపగా లంక స్కోర్ నెమ్మదించింది. ఆఖర్లో కుశాని నుత్యంగన(19 నాటౌట్) మెరుపులతో ఆటపట్టు బృందం నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 రన్స్ చేయగలిగింది.
4⃣ overs
1⃣ Maiden
4⃣ Wickets 😎A fantastic spell in Trivandrum from Renuka Singh Thakur! 👏👏
Updates ▶️ https://t.co/Vkn1t7b6Dm#TeamIndia | #INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/GdHInJn1p5
— BCCI Women (@BCCIWomen) December 26, 2025