INDW vs SLW : సొంతగడ్డపై పంజా విసురుతున్న భారత మహిళల జట్టు టీ20 సిరీస్‌ను పట్టేసేందుకు సిద్ధమైంది. విశాఖపట్టణంలో శ్రీలంకను చిత్తుగా ఓడించి 2-0తో ఆధిక్యంలో కొనసాగుతున్న టీమిండియా త్రివేండ్రంలోనూ చెలరేగాలనుకుంటోంది. మూడోసారి టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో కీలకమైన మ్యాచ్ కావడంతో రెండు మార్పులు చేసింది టీమిండియా.
వైజాగ్‌లో శ్రీలంకను వణికించిన భారత్ త్రివేండ్రంలోనూ జోరు చూపాలనుకుంటోంది. ఇక్కడే సిరీస్‌ను గెలుపొందాలనే కసితో ఉన్న టీమిండియా సీనియర్లు రేణుకా సింగ్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలను తుది జట్టులోకి తీసుకుంది. బోణీ కోసం నిరీక్షిస్తున్న శ్రీలంక మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.
భారత తుది జట్టు : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రీచా ఘోష్(వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, వైష్ణవీ శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.
శ్రీలంక తుది జట్టు : చమరి ఆటపట్టు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిశ దిల్హరి, నిలాక్షి డిసిల్వా, ఇమేశా దులానీ, కుశాని నుత్యంగన(వికెట్ కీపర్), మల్కి మదర, ఇనొక రణవీర, మల్షా షెహానీ, నిమేశ మధుషానీ.