కోల్‌కతా: కొద్ది రోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో రికార్డు ధర (రూ.27 కోట్లు) దక్కించుకున్న యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) సారథిగా నియమితుడయ్యాడు. ఈ మేరకు ఎల్ఎస్జీ యజమాని సంజీవ్ గొయెంకా.. సోమవారం కొత్త సారథిని అధికారికంగా ప్రకటించాడు. కొత్త ఆశలు, ఆకాంక్షలతో ఈ సీజన్‌ను ప్రారంభించబోతున్నామని చెబుతూ.. పంత్‌ను ‘ఇదిగో ఇతడే మా కొత్త సారథి’ అని పాత్రికేయులకు పరిచయం చేశాడు.
గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథిగా పనిచేసిన అనుభవమున్న పంత్‌కు కెప్టెన్‌గా ఇది రెండో జట్టు. ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ.. ‘నా మీద మీరు ఉంచిన నమ్మకానికి అనుగుణంగా నేను నిబద్ధతగా నడుచుకుంటా. లక్నోకు సారథిగా వ్యవహరించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని అన్నాడు. జాతీయ జట్టులో సీనియర్ ఆటగాళ్లు, సారథుల నుంచి తాను ఎంతగానో నేర్చుకున్నానని, ఆ అనుభవం ఐపీఎల్లో ఉపయోగపడుతుందని పంత్ తెలిపాడు.