IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ మే 17 నుంచి కొత్త షెడ్యూల్ ప్రకారం కొనసాగనుంది. అయితే.. తేదీల మార్పుతో మ్యాచ్ టికెట్ల కొనుగోలుపై గందరగోళం నెలకొంది. ఎందుకంటే.. రద్దయిన మ్యాచ్ టికెట్ల డబ్బులను రీఫండ్ (Refund) చేసేందుకు ఫ్రాంచైజీలు అంగీకరించాయి. కానీ, షెడ్యూల్ మారడంతో.. ముందస్తుగా టికెట్లు కొనుక్కున్న వాళ్లు తమ సంగతేంటీ? అని ఒకింత అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ జట్లు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాయి. ఇప్పటికే టికెట్లు కొన్నవాళ్లను స్టేడియాల్లోకి అనుమతిస్తామని వెల్లడించాయి.
ఐపీఎల్ పునరుద్ధరణ తర్వాత మే 17న తొలి మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ సొంత ఇలాకాలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మే 23న తలపడనుంది. మొదటి షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ మే 13న జరగాల్సింది. కానీ, భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా వారం రోజులు లీగ్ వాయిదా పడింది. దాంతో, తమ డబ్బుల్ని రీఫండ్ చేస్తారా? అని ఫ్యాన్స్ చర్చించుకోసాగారు.
🚨 Important Announcement: 𝗧𝗶𝗰𝗸𝗲𝘁 𝗩𝗮𝗹𝗶𝗱𝗶𝘁𝘆 𝗳𝗼𝗿 𝗥𝗖𝗕 𝘃 𝗦𝗥𝗛
Tickets purchased for #RCBvSRH match, originally scheduled for 13th May, will remain valid for the same game, now rescheduled to 23rd May. 🤩
However, if any valid digital ticket holder wishes to… pic.twitter.com/jMMhdrhmjE
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 13, 2025
షెడ్యూల్ మార్పు కారణంగా అప్పటికే టికెట్లు కొన్నవాళ్లు కంగారు పడొద్దని ఆర్సీబీ తెలిపింది. చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్‌కు ఇంతకుముందే టికెట్లు కొన్నవాళ్లందరినీ అనుమతిస్తామని మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది యాజమాన్యం. దాంతో, ఫ్యాన్స్ ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుంటున్నారు. లీగ్ దశలో జరగాల్సిన 17 మ్యాచ్‌లను ఆరు నగరాల్లో నిర్వహించనున్నారు. కానీ, ప్లే ఆఫ్స్ మ్యాచ్ వేదికలతో పాటు జూన్ 3న ఫైనల్ జరిగేది ఎక్కడ? అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.
RCB vs KKR Ticket Validity Related Information
As there is no change in date and time for #RCBvKKR, original tickets purchased will stay valid for the revised schedule as well, and no refunds will be processed.
For more information, reach out to us on rcbtickets@ticketgenie.in pic.twitter.com/NbAHuZj3a6
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 13, 2025